మేడిపల్లి, వెలుగు: అమ్మాయితో ఫోన్‌లో మాట్లాడుతున్నందుకు తండ్రి మందలించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెంగిచర్ల గణేశ్‌నగర్‌కు చెందిన చాపల ఎల్లయ్య కొడుకు వెంకటేశ్(19) ఓ యువతితో ఫోన్‌లో తరచూ మాట్లాడుతున్నాడు. దీంతో తండ్రి ఎల్లయ్య ఈ నెల 9న వెంకటేశ్‌ను మందలించాడు.
మరుసటి రోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంటి నుంచి వెంకటేశ్ వెళ్లిపోయాడు. ఈ నెల 14న ఇంటి వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని కుళ్లిన స్థితిలో వెంకటేశ్ మృతదేహం కనిపించింది.
